ధర్మో రక్షతి రక్షితః అనే వాక్యం వాల్మీకి రచించిన రామాయణంలోని ఒక శ్లోకంలోనిది. ఈ వాక్యం అర్థం "ధర్మాన్ని మనము అనుసరిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది".
శ్లోకం
ధర్మ ఏవ హతోహంతి, ధర్మో రక్షతి రక్షితః
తస్మాత్ ధర్మో న హంతవ్యో, మానో ధర్మోహతోవధీత్
అని మనుస్మృతిలో చెప్పబడింది. ధర్మాన్ని బాధిస్తే అది తిరిగి మననే బాధిస్తుంది. ధర్మ రక్షణ చేస్తే అది మనను రక్షిస్తుంది.
శ్లోకం అర్థం
"చంపబడిన ధర్మం ఆ ధర్మాన్ని చంపినవాణ్ణి చంపుతుంది;
రక్షింపబడిన ధర్మం అ ధర్మాన్ని రక్షించినవారిని రక్షిస్తుంది;
కనునుక, ధర్మం చేత మనం ఎప్పుడూ చంపబడకుండా ఉండేందుకు
మనం ఆ ధర్మాన్ని సదా రక్షించాలి"